ఏడాది బుడ్డోడు రూ.7 కోట్లు గెలిచాడు

6 Feb, 2020 08:05 IST|Sakshi

అబుదాబి: అదృష్టమంటే ఇదేనేమో... ఏడాది బుడ్డోడు ఒక మిలియన్‌ డాలర్‌(సుమారు ఏడు కోట్ల పైచిలుకు) గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. ఈ అరుదైన ఘటన దుబాయ్‌లో జరిగింది. రమీస్‌ రహ్మాన్‌ అనే కేరళకు చెందిన వ్యక్తి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ నిర్వహిస్తున్న లాటరీ టికెట్‌లో తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోవాలనుకున్నాడు. వెంటనే తన ఏడాది వయసున్న కొడుకు మహమ్మద్‌ సాలా పేరు మీద టికెట్‌ కొనుగోలు చేశాడు. మంగళవారంనాడు లాటరీ సంస్థ నిర్వాహకులు లక్కీడ్రా నిర్వహించగా అందులో తనయుడు మహమ్మద్‌ పేరు కూడా ఉండటంతో అతని తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. (కోటి రూపాయల లాటరీ.. భయంతో పోలీసుల వద్దకు!)

‘ఇది నిజంగా ఎంతో సంతోషకరమైన వార్త. ఇక నాకు ఎలాంటి ఢోకా లేదు. లాటరీ డబ్బు నా కుమారుడి భవిష్యత్తుకు ఎంతగానో భరోసానిస్తుంది’ అని రమీస్‌ సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయాడు. కాగా గతంలోనూ చాలామంది భారతీయులు లక్కీడ్రాలో తమ అదృష్టాన్ని నిరూపించుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఓ భారతీయ రైతు ఉపాధిని వెతుక్కుంటూ దుబాయ్‌కు వలస వచ్చాడు. కానీ సరైన ఉపాధి దొరక్కపోవడంతో భారత్‌కు తిరుగుముఖం పట్టాడు. ఈ క్రమంలో తన దగ్గర చిల్లిగవ్వ లేకపోయినప్పటికీ భార్య దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని మరీ లాటరీ టికెట్‌ కొనుగోలు చేయగా 4 మిలియన్‌ డాలర్లు గెలుచుకున్నాడు. దీంతో అతని దిశే తిరిగిపోయింది.

చదవండి: ఎర్రచీరలో ఇరగదీసిన పెళ్లికూతురు

చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది

మరిన్ని వార్తలు