దోశ ఆకృతిలో క‌నిపిస్తున్న గ్ర‌హం

29 Jun, 2020 15:04 IST|Sakshi

వాషింగ్టన్‌ : మొన్న‌టికి మొన్న సూర్యుడి వీడియో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లను ఎంత‌గా అబ్బుప‌రిచిందో తెలిసిన విష‌య‌మే. పదేళ్లలో తీసిన దాదాపు 425 మిలియన్ల హై రెజల్యూషన్‌ చిత్రాలను దాదాపు గంట నిడివి ఉండే వీడియోగా రూపొందించిందీ నాసా. ఇది చూసిన నెటిజ‌న్లు సూర్యుడికి నానాటికీ ఫైర్ పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు అంటూ చ‌మ‌త్క‌రించారు. ఈసారి బృహ‌స్ప‌తి ఫొటో నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. కానీ ఆ గ్ర‌హాన్ని బృహ‌స్ప‌తి అని పిల‌వ‌డానికి చాలామందికి మ‌న‌సొప్ప‌డం లేదు. అందుకు బ‌దులుగా దోశ‌, మ‌సాలా దోశ‌ అంటూ ర‌క‌ర‌కాల దోశ పేర్ల‌తో పిలుచుకుంటున్నారు. (జాబిల్లి యాత్రకు మహిళ సారథ్యం)

దీనికి కార‌ణం అది దోశ ఆకృతిలో క‌నిపించ‌డ‌మే. తొలిసారిగా ఈ ఫొటో చూసిన‌వారెవ‌రైనా అది దోశ అని భ్ర‌మించి త‌ప్పులో కాలేస్తారు. 2000వ సంవ‌త్స‌రంలో నాసా తీసిన బృహ‌స్ప‌తి ఫొటో ప్ర‌స్తుతం ఆహార‌ప్రియుల‌ను తెగ ఆక‌ర్షిస్తోంది. "ఇది ఖ‌చ్చితంగా దోశ‌లాగే క‌నిపిస్తుంది అనేవాళ్లు చేతులెత్తండి" అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. "లేదు లేదు, నోరూరిస్తున్న దోశ‌ను ప‌ట్టుకుని బృహ‌స్ప‌తి అంటారేమిటి? అది అబ‌ద్ధం" అంటూ మ‌రో నెటిజన్ చ‌మ‌త్క‌రించాడు. (వైరల్‌గా నాసా విడుదల చేసిన సూర్యుడి వీడియో..)

మరిన్ని వార్తలు