వెస్ట్‌మినిస్టర్‌లో గిల్ట్‌ ట్యాక్స్‌!

12 Feb, 2018 02:44 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాజధాని లండన్‌లో అంతర్భాగమైన వెస్ట్‌మినిస్టర్‌ ప్రాంతంలో స్థానిక పన్నుల ఆదాయాన్ని పెంచేందుకు ఓ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. లండన్‌లోనే కాక మొత్తం బ్రిటన్‌లోనే అత్యంత సంపన్న ప్రాంతాల్లో వెస్ట్‌మినిస్టర్‌ఒకటి. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా వెస్ట్‌మినిస్టర్‌ కౌన్సిల్‌ అనే నగర పాలక సంస్థ కూడా ఉంది.

ప్రజలందరూ సాధారణంగా కట్టే పన్నులకు అదనంగా సంపన్నులు స్వచ్ఛందంగా కూడా విరాళాలు ఇవ్వాలని వెస్ట్‌మినిస్టర్‌ కౌన్సిల్‌ ప్రతిపాదిస్తోంది. ఈ విరాళాలను అక్కడి మీడియా ‘గిల్ట్‌ ట్యాక్స్‌’ అని వ్యవహరిస్తోంది. గిల్ట్‌ ట్యాక్స్‌ ద్వారా వచ్చిన డబ్బును ఉద్యోగ కల్పన, రోడ్లపై నిద్రించేవారికి దుప్పట్లు ఇవ్వడం తదితర అవసరాలకు ఉపయోగిస్తామని వెస్ట్‌మినిస్టర్‌ కౌన్సిల్‌ చెబుతోంది. కోటి పౌండ్లకు పైగా ఆస్తులు ఉన్న వారి నుంచి స్వచ్ఛందంగానే గిల్ట్‌ ట్యాక్స్‌ను వసూలు చేస్తామనీ, ఇందుకోసం 15 వేల మంది సంపన్నులకు లేఖలు రాస్తామంటోంది.

మరిన్ని వార్తలు