ట్రంప్‌‌ రైటే

1 Jun, 2020 09:18 IST|Sakshi

న్యూయార్క్‌ :  డొనాల్డ్‌ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిలా మాట్లాడటం అరుదు. ప్రతి విషయానికీ ఓ అమెరికన్‌ జాతీయవాద పౌరుడిలా ఆయన ప్రతిస్పందిస్తుంటారు. తాజాగా ‘వెన్‌ లూటింగ్‌ స్టార్ట్స్, షూటింగ్‌ స్టార్ట్స్‌’ అని ఇప్పుడొక ట్వీట్‌ చేశారు ఆయన. మినియాపొలిస్‌‌లో జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే ఒక నల్లజాతి అమెరికన్‌ పౌరుడిని ఒక అమెరికన్‌ పోలీసు మోకాలితో గొంతుపై ఎనిమిది నిముషాలపాటు తొక్కి ఉంచి, ఊపిరి ఆడకుండా చేసి చంపేసిన అమానుష దుశ్చర్యపై అమెరికా అంతటా నిరసన లూటీలు మొదలయ్యాయి. ఈ లూటీలను దృష్టిలో ఉంచుకుని ట్రంప్‌.. పైవిధంగా ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌ దానిని వెంటనే కనిపించకుండా చేసింది. ఫేస్‌బుక్‌ని కూడా అలా చేయమని కోరింది. ( జీ–7 కూటమిని జీ–10 చేయాలి )

అందుకు ఫేస్‌బుక్‌ నిరాకరించింది. ‘‘పర్యవసానాలను ప్రజలకు తెలియకుండా దాచేస్తే మరింత నష్టం జరుగుతుంది. ట్రంప్‌ ట్వీట్‌ని ఆయన చేసిన ప్రకటనలా చూడకూడదు. ఆయన చెప్పిన వాస్తవంలా పరిగణించాలి’’ అని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ అన్నారు. ఆ మాట నిజమే. ముందైతే హెచ్చరించడం ప్రభుత్వ ధర్మం. కాకపోతే ఆ ధర్మాన్ని ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిలా కాక, ఒక దేశవాళీ అమెరికన్‌లా పాటించారు.

మరిన్ని వార్తలు