ఫిలిప్పైన్స్లో భూకంపం

14 Apr, 2016 08:21 IST|Sakshi

మనీలా: దక్షిణ ఫిలిప్ఫైన్స్లో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదు అయింది. ఈ మేరకు భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం కాని సంభవించినట్లు సమాచారం లేదని తెలిపారు. ఈ భూకంపం గురువారం తెల్లవారుజామున 2.21 గంటలకు వచ్చిందన్నారు. సియోకన్ ద్వీపంలోని 12 కిలోమీటర్ల అడుగు భాగంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. ఇది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాకు 750 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది.

మరిన్ని వార్తలు