‘నెస్సీ‌’  మాన్‌స్టర్‌ నిజమేనా?

30 Dec, 2017 16:47 IST|Sakshi

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : ‘నెస్సీ’ ఈ పేరు వింటే చాలు యూనైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రజల వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. నీటిలో నివసించే ఈ మాన్‌స్టర్‌ గత 150 లక్షల సంవత్సరాలు యూకే సముద్రతీర ప్రాంతాల్లో తిరుగుతోందని ప్రతీతి. నెస్సీ (లేదా) లోచ్‌ నెస్‌ను తొలిసారిగా స్కాట్లాండ్‌లోని లోచ్‌ నెస్‌ అనే ప్రాంతంలో కనిపించినట్లు చెబుతారు. అయితే, నెస్సీ నిజంగానే ఉందా? అనే ప్రశ్నకు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.

‘నెస్సీ’ ఎందుకంత పాపులర్‌‌?
‘లైఫ్‌ ఆఫ్‌ సెయింట్‌ కొలంబియా’ అనే పుస్తకంలో అడ్మోనన్‌ అనే రచయిత నెస్సీ గురించి పేర్కొన్నట్లు రిపోర్టులు ఉన్నాయి. ఈ పుస్తకంలో క్రీస్తు పూర్వం 565లో నెస్సీని తొలిసారి ఓ ఐరిష్‌ సన్యాసి చూసినట్లు ఉంది. జలాశయం నుంచి బయటకు వచ్చిన నెస్సీ ఓ వ్యక్తిని నీటిలోకి లాక్కెళ్లడాన్ని సన్యాసి చూశారని తెలిపింది. 

పొడవైన మెడ, భారీ తలతో వికృత రూపంలో నెస్సీ ఉంటుందని పుస్తకంలో ఉంది. 1930వ దశకంలో నెస్సీ నిజంగానే ఉందని నిరూపించేందుకు పలువురు ఔత్సాహికులు ప్రయత్నాలు ఆరంభించారు. ఆ తర్వాత కొద్దికాలానికి లోచ్‌నెస్‌ ప్రాంతం చుట్టూ ఓ రోడ్డును నిర్మించడంతో నెస్సీపై యూకే వ్యాప్తంగా రూమర్లు పాకాయి. అంతేకాకుండా పలువురు లోచ్‌ నెస్‌ మాన్‌స్టర్‌ని చూశామని చెప్పడంతో నెస్సీ పేరు మారుమోగిపోయింది.

సర్జన్‌.. ఓ ఫొటో..
రాబర్ట్‌ కెన్నెత్‌ విల్సన్‌ అనే సర్జన్‌ 1934లో నెస్సీ ఫొటోను విడుదల చేశారు. ఆ ఫొటోను డెయిలీ మెయిల్‌ ప్రచురించడంతో నెస్సీ గురించి రూమర్లు విపరీతమయ్యాయి. దీంతో శాస్త్రవేత్తలు లోచ్‌ నెస్‌ ప్రాంతంలోని సముద్రంలో నెస్సీ కోసం పదేళ్ల పాటు గాలించారు. సోనార్లతో ఆ ప్రదేశాన్ని జల్లెడపట్టారు. అప్పటికీ నెస్సీ ఆచూకీ తెలీకపోవడంతో ప్రయత్నాలు విరమించుకున్నారు. 1974లో నెస్సీ పేరుతో విడుదలైన ఫొటో ఫేక్‌ అని తేలింది.

వెతుకులాట ఇంకా కొనసాగుతోంది..
1975 నుంచి నెస్సీని చూశామని చెబుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో నెస్సీ పేరు చెబితే భయంతో వణికిపోవడం ప్రారంభించారు యూకే ప్రజలు. 2017 సంవత్సరంలో తొమ్మిదిసార్లు నెస్సీ కనిపించినట్లు రిపోర్టులు వచ్చాయి. 

అయితే, నెస్సీని చూశామని యూకే మనోగతాన్ని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. మరేదైనా ఇతర సముద్రచర జీవిని చూసి నెస్సీగా వారు భావించి ఉండొచ్చని చెబుతున్నారు.  


 

మరిన్ని వార్తలు