లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం

24 Oct, 2023 16:28 IST|Sakshi

లండన్: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలపై ప్రధాని రిషి సునాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది  యూదులతో పాటు ప్రజాస్వామ్య విలువలకు ముప్పులా పరిణమిస్తుందని అన్నారు. లండన్‌లో ఇలాంటి నినాదాలను సహించబోమని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా లండన్, బర్మింగ్‌హామ్, కార్డిఫ్,  బెల్ఫాస్ట్ సహా ఇతర నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇందులో కొందరు ఆందోళనకారులు జిహాద్ నినాదాలు కూడా చేశారు.

'ఈ శనివారం జరిపిన నిరసనల్లో వీధుల్లో ద్వేషాన్ని చూశాము. జిహాద్ పిలుపులు యూదు సమాజానికి మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య విలువలకు కూడా ముప్పు. మన దేశంలో యూదు వ్యతిరేకతను  ఎప్పటికీ సహించము. తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలను పోలీసులు తీసుకోవాలని ఆదేశిస్తున్నాం.' అని రిషి సునాక్ అన్నారు.  

గ్రేటర్ లండన్ ప్రాంతంలో పాలస్తీనియన్లకు మద్దతుగా నిరసనలు చేలరేగగా.. ద్వేషపూరిత నినాదాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. ఆందోళనలు అదుపుతప్పాయని చెప్పారు. ఈ ఘటనల్లో ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారని వెల్లడించారు. జిహాద్ అంటూ నినాదాలు చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను కూడా షేర్ చేశారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో రిషి సునాక్ ఇజ్రాయెల్‌ పట్ల నిలబడిన విషయం తెలిసిందే. హమాస్ ఉగ్రవాద సంస్థ ఆగడాలను నిలిపివేయాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో తాము తోడుగా ఉంటామని స్పష్టం చేశారు.  

ఇదీ చదవండి: ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు