ట్రంప్‌ తర్వాత మోదీనే..

6 Dec, 2017 09:23 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ రికార్డులు కొనసాగుతున్నాయి. మోదీ 2017లో 3.75 కోట్ల ఫాలోవర్లతో భారత్‌లోనే  ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్ల జాబితాలో టాప్‌గా నిలిచారు. అంతకుముందు ఏడాది ట్విట్టర్‌లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 2.4 కోట్లుగా ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫాలోవర్ల సంఖ్య 4.4 కోట్లకు పెరిగింది. 2017లో ట్రంప్‌, మోదీ మోస్ట్‌ ట్వీటెడ్‌ వరల్డ్‌ లీడర్‌గా టాప్‌ టూ స్ధానాల్లో నిలిచారని ట్విట్టర్‌ పేర్కొంది.

ట్విట్టర్‌లో మోదీ అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారతీయుడిగా కొనసాగుతున్నా ఫోలవర్ల బేస్‌ పెరుగుదలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కన్నా తక్కువగా ఉండటం గమనార్హం.ట్విట్టర్‌ టాప్‌ 10 వరల్డ్‌ లీడర్స్‌లో ట్రంప్‌, మోదీ తర్వాత నికోలస్‌ మదురో (వెనిజులా), తయిప్‌ ఎర్డోగన్‌ (టర్కీ), థెరిసా మే (బ్రిటన్‌) వంటి నేతలున్నారు.

2017లో టాప్‌ త్రీ మోస్ట్‌ లైక్డ్‌ ట్వీట్‌ల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పోస్టింగ్స్‌ రెండు ఉండటం విశేషం. ఓ వ్యక్తి శరీర రంగు, నేపథ్యం, మతం ఆధారంగా మరో వ్యక్తి ద్వేషించరాదంటూ ఒబామా చేసిన ట్వీట్‌ 2017లో రెండవ అత్యధిక రీట్వీటెడ్‌ ట్వీట్స్‌గా నిలిచింది.

మరిన్ని వార్తలు