ఫొటో షూట్‌.. కొత్త జంటకు చేదు అనుభవం

3 Jul, 2020 14:03 IST|Sakshi

కాలిఫోర్నియా: నూతన వధువరులకు ఫొటోషూట్‌ అనేది ఎప్పటికి మిగిలిపోయే మధుర జ్ఞాపకం. కానీ అమెరికాకు చెందిన ఓ జంటకు ఇది చేదు జ్ఞాపకంగా మిగిలింది.  కాలిఫోర్నియాకు చెందిన ఓ జంట వివాహ అనంతరం లగునా బీచ్‌కు ఫొటో షూట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారు బీచ్‌ తీరంలో ఓ పెద్ద రాయిపై నిలుచుని ఫొటోకు ఫోజ్‌ ఇస్తుండగా ఒక్కసారిగి ఓ పెద్ద అలా వారిని సముద్రంలోకి లాక్కెళ్లింది. (ఒక్క ఫోన్‌కాల్‌: ప‌్ర‌కంప‌న‌లు సృష్టించింది..)

అది చూసిన స్థానికులు వధూవరులను రక్షించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘ఫొటో షూట్‌‌ కోసం అంత సాహసం చేయడం అనవసరం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాలిఫోర్నియాలో ఈ లగునా బీచ్‌ ప్రసిద్ది చెందింది. ఇక్కడ తరచూ వధువరూలు ఫొటో షూట్‌కు వస్తుంటారని సందర్శకులు తెలిపారు. (వేడుకలు ఆరంభం)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు