‘అణు బంధం’పై పాక్ ఆందోళన

29 Jan, 2015 02:54 IST|Sakshi
  • దక్షిణాసియాలో సుస్థిరతకు దెబ్బ: సర్తాజ్ అజీజ్
  • ఇస్లామాబాద్: అమెరికా - భారత్‌లు అణు ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడంపై పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇది ప్రాంతీయ సుస్థిరతను అస్థిరపరచేలా ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. ‘‘భారత్ - అమెరికాల మధ్య అణు ఒప్పందాన్ని రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం అమలుచేయటం.. దక్షిణాసియాలో సుస్థిరతపై హానికరమైన ప్రభావం చూపుతుంది’’ అని పాక్ జాతీయ భద్రతా సలహా దారు సర్తాజ్ అజీజ్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు షిన్‌హువా వార్తా సంస్థ తెలిపింది.  

    మరోపక్క అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన తర్వాత పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందించారు. భారత్‌తో పరస్పర గౌరవం, సార్వభౌమత్వం కోరుకుంటున్నామని  వెల్లడించారు. బుధవారం  ప్రధాని కార్యాలయంలో భారత్‌లో పాక్ హైకమిషనర్ అబ్దుల్‌బాసిత్ షరీఫ్‌తో భేటీ అయి పాక్-భారత్ సంబంధాలను షరీఫ్‌కి వివరించారు.
     
    పాక్- అఫ్ఘాన్ ఐఎస్‌ఐఎస్ చీఫ్‌గా హఫీజ్

    కాగా, పాకిస్తాన్- అఫ్ఘానిస్థాన్ ఐఎస్‌ఐఎస్(ఇస్లామిక్ స్టేట్) ఛీఫ్ గా తాలిబన్ మాజీ కమాండర్ హఫీజ్ సయీద్ ఖాన్‌ను నియమించినట్లు ఐఎస్‌ఐఎస్ కమాండర్ అబు ముహమ్మద్ అల్ అద్ని ప్రకటించాడు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా