26 మంది భారత జాలర్లను విడుదలచేసిన పాక్‌

13 Aug, 2018 03:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేడు భారత అధికారులకు అప్పగింత

కరాచీ: దాయాది దేశం పాకిస్తాన్‌ 26 మంది భారత జాలర్లను ఆదివారం విడుదల చేసింది. ఇప్పటివరకూ కరాచీ మలిర్‌ జైలులో ఉన్నవీరిని లాహోర్‌కు తీసుకెళ్లనున్నారు. సోమవారం వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించనున్నారు. పాక్‌ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో వీరిని అధికారులు అరెస్ట్‌ చేశారు. పాక్‌కు చెందిన ఈదీ ఫౌండేషన్‌ భారత జాలర్ల ప్రయాణ ఖర్చులను భరించింది. భారత్, పాక్‌ల మధ్య ప్రాదేశిక జలాలకు సంబంధించి స్పష్టమైన ఏర్పాట్లు లేకపోవడంతో పాటు జాలర్లు వాడే పడవలకు జీపీఎస్‌ తరహా సౌకర్యం లేకపోవడంతో ఇరుదేశాలకు చెందిన జాలర్లను అధికారులు తరచూ అరెస్ట్‌ చేస్తున్నారు. భారత్, పాక్‌లో విచారణలో తీవ్ర జాప్యం కారణంగా వీరంతా నెలల తరబడి జైళ్లలోనే మగ్గుతున్నారు. కాగా, ప్రాదేశిక జలాల విషయంలో భారత్, పాక్‌లు నిబంధనలు సడలించాలని, జాలర్లకు సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తిచేయాలని ఈదీ ఫౌండేషన్‌ కోరింది.  

మరిన్ని వార్తలు