'బాగ్దాదీ చావలే.. మేం చంపాకే నమ్ముతాం'

22 Jul, 2017 11:18 IST|Sakshi
'బాగ్దాదీ చావలే.. మేం చంపాకే నమ్ముతాం'

వాషింగ్టన్‌: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీ ఇప్పటికీ బతికే ఉన్నట్లు భావిస్తున్నామని అమెరికా తెలిపింది. ఇటీవల తాము జరిపిన వైమానిక దాడుల్లో బాగ్దాదీ చనిపోయినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సిరియాకు చెందిన హక్కుల సంస్థ కూడా పేర్కొంది.

అయితే, తాను మాత్రం బాగ్దాదీ హతమయ్యాడని అనుకోవడం లేదని, వైమానిక దాడుల్లో అతడి ఎలాంటి హానీ జరగలేదని భావిస్తున్నానని అమెరికా ప్రధాన రక్షణ స్థావరం పెంటగాన్‌ చీఫ్‌ జిమ్‌ మాట్టిస్‌ అన్నారు. 'బాగ్దాదీ బతికే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. తాము చంపేసినప్పుడు మాత్రమే అతడు చనిపోయాడని మేం నమ్ముతాం' అని చెప్పారు. అమెరికా బాగ్దాదీ తలపై దాదాపు 25 మిలియన్‌ డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది.

మరిన్ని వార్తలు