లిబియాలో శరణార్థులు గల్లంతు! 

3 Feb, 2018 02:40 IST|Sakshi

పారిస్‌: లిబియా నుంచి యూరోప్‌కు అక్రమ వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 90 మంది శరణార్థులు గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారిలో 10 మంది మృతదేహాలు లిబియా తీర పట్టణమైన జవారా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వీరిలో 8 మంది పాకిస్తానీయులు, ఇద్దరు లిబియాకు చెందిన వారు ఉన్నట్లు భావిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కటం వల్లే పడవ మునిగిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు అంతర్జాతీయ వలస సంస్థకు చెందిన ప్రతినిధి ఒలివియా హెడన్‌ తెలిపారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది పాక్‌కు చెందిన వారే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. 
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు