‘అక్రమ సంతానంలో భారతీయులు కూడా ఉన్నారు’

12 Jul, 2018 21:00 IST|Sakshi
ఇమ్రాన్‌ ఖాన్‌ - రేహమ్‌ ఖాన్‌లు (ఫైల్‌ఫోటో)

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, తెహ్రికె ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రేహమ్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఇమ్రాన్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడని, చేతబడులు వంటి వాటిని నమ్ముతాడని, అతనికి ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో భారత్‌కు చెందిన వారు కూడా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌ గురించి అతని మాజీ భార్య రేహమ్‌ ఖాన్‌ రచించిన పుస్తకం గురువారం విడుదలయ్యింది.

ఈ పుస్తకంలో ఆమె వారి పది నెలల వైవాహికి జీవితానికి సంబంధించిన అంశాలనే కాక ఇమ్రాన్‌ ఖాన్‌ రాజకీయ, వ్యక్తిగత  అంశాలను తెలియజేసారు. కొన్నాళ్లుగా ఈ బుక్‌లోని కీలక అంశాలను లీక్ చేస్తూ వచ్చిన ఆమె.. మొత్తానికి ఇవాళ బుక్ రిలీజ్ చేసింది. ఇందులో ఇమ్రాన్ గురించి కొన్ని సంచలన విషయాలను వెల్లడించింది.

గురువారం విడుదలైన ఈ పుస్తకంలో ఇమ్రాన్‌కు భారత ప్రధాని మోదీలాగా ప్రధాన మంత్రి కావాలనే కోరిక ఉందని తెలియజేసారు. అంతేకాక ఇమ్రాన్ ఖాన్ స్వలింగ సంపర్కం కూడా చేసేవారని వెల్లడించింది. ఆయన క్లోజ్ ఫ్రెండ్ మోబీతో ఇమ్రాన్‌కు శారీరక సంబంధం ఉందని చెప్పింది. మోబీకి అప్పటికే పెళ్లి అయినట్లు తెలిపింది.

ఇక ఇమ్రాన్‌ఖాన్‌కు చాలా మందితో అక్రమ సంతానం ఉన్నారని కూడా ఆ పుస్తకంలో రేహమ్ వెల్లడించింది. ఇమ్రాన్‌కు మొత్తం ఐదుగురు అక్రమ సంతానం ఉన్నారని, వారిలో భారత్‌కు చెందిన వారు కూడా ఉన్నారని  ఆమె చెప్పింది. తనకు కాకుండా ఇమ్రాన్ తొలి భార్య జెమీమా గోల్డ్‌స్మిత్‌కు మాత్రమే ఆయన అక్రమ సంతానం గురించి తెలుసని రేహమ్ తెలిపింది. ఇమ్రాన్‌తో సంతానం పొందిన భారత మహిళల గురించి ‘వాళ్లంతా తమ వైవాహిక జీవితంలో పిల్లలను కనలేకపోవడంతో తనతో సంతానం పొందినట్లు ఇమ్రాన్ చెప్పేవార’ని రేహమ్ వెల్లడించింది.

ఇమ్రాన్ ఖాన్‌కు డ్రగ్స్ తీసుకొనే అలవాటు కూడా ఉన్నట్లు ఆ పుస్తకంలో ఆయన మాజీ భార్య స్పష్టంచేసింది. ఆయన బాత్‌రూమ్‌లో కొకైన్ తీసుకుంటుండగా తాను చాలాసార్లు చూసినట్లు చెప్పింది. ఇక చేతబడుల్లాంటి వాటిని కూడా ఇమ్రాన్ నమ్ముతాడని వెల్లడించింది. తనకున్న దోషం పోవడానికి నల్లటి కందులతో ఇమ్రాన్ తన శరీరమంతా రుద్దుకోవడాన్ని తాను చూసినట్లు రేహమ్ ఆ బుక్‌లో తెలిపింది.

పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పుస్తకం విడుదల కావడంతో ఇమ్రాన్‌ఖాన్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

‘పాకిస్తాన్‌ హిట్లర్‌గా ఇమ్రాన్‌’

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

‘నేను డయానాను.. నాకిది పునర్జన్మ’

లండన్‌ సురక్షిత నగరమేనా?

యానిమేషన్‌ స్టూడియోకు నిప్పు

హెచ్‌1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ

దారుణం: 24 మంది సజీవ దహనం

మీరు అసలు మనుషులేనా..ఇంతలా హింసిస్తారా?

రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..

అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని అరెస్ట్‌

ఇంతకు ‘తను’ తండ్రా, తల్లా?!

నీకు నోబెల్‌ వచ్చిందా? గొప్ప విషయమే!

ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

ఒక్కసారి బ్యాటింగ్‌ మొదలుపెడితే..

ఉగ్ర సయీద్‌ అరెస్ట్‌

ప్రతిభ వలసల వీసాలు 57 శాతం

ఉరి.. సరి కాదు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’