అంతరిక్ష యాత్రికుల కోసం 'స్పేస్ బూట్'

28 Jul, 2016 14:18 IST|Sakshi
అంతరిక్ష యాత్రికుల కోసం 'స్పేస్ బూట్'

న్యూయార్క్: అంతరిక్ష యాత్రికుల కోసం మసాచూసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త రకం బూట్లను(స్పేస్ బూట్) తయారుచేశారు. ప్రత్యేకమైన సెన్సార్లు, హ్యాప్టిక్ మోటార్లతో రూపొందించిన ఈ బూట్లు వైబ్రేషన్స్ కలిగిస్తాయి. ఈ వైబ్రేషన్ల మూలంగా ఆస్ట్రోనాట్లు అంతరిక్షంలో చిన్నచిన్న ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చని పరిశోధకులు వెల్లడించారు.

అంతరిక్ష యాత్రికులకు వారి బరువైన స్పేస్ సూట్ మూలంగా ఉన్నటువంటి అసౌకర్యాన్ని ఈ స్పేస్ బూట్ తొలగిస్తుందని పరిశోధకురాలు లియా స్టిర్లింగ్ తెలిపారు. 'భారీ వ్యయంతో కూడిన అంతరిక్ష యాత్రల్లో ఆస్ట్రోనాట్లు కొన్నిసార్లు నియంత్రణ కోల్పోయి కింద పడటం మూలంగా వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతో పాటు.. ప్రాజెక్ట్ మొత్తం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ బూట్ల ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు' అని ఆమె వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు