ఫైవ్ స్టార్ హోటల్‌పై ఉగ్రదాడి : భీకర కాల్పులు

11 May, 2019 19:55 IST|Sakshi

పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్‌ ప్రాంతం గ్వాదర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఉగ్రవాదులు దాడి చేశారు. ముగ్గురు లేదా నలుగురు టెర్రరిస్టులు ది పెర్ల్‌ కాంటినెంటల్‌ (పీసీ) హోటల్లో చొరబడి, కాల్పులకు  తెగబడ్డారు. ​వీరి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని ప్రాధమిక సమాచారం. హోటల్ నుంచి భారీగా బాంబు పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి  పాల్పడి వుంటుందని  అనుమానిస్తున్నారు.  ప్రాణనష్టంపై ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేనప్పటికి పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది.  దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

ఫైవ్ స్టార్ హోటల్ మీద ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే ఏటీఎఫ్‌ బలగాలు రంగంలోకి దిగాయి. భారీ ఎత్తున భద్రతా దళాలను హోటల్ బయట మోహరించాయి. టెర్రరిస్టులు రాకెట్ లాంచర్లు పట్టుకుని ఉన్నారని, ఆత్మాహుతి కోసం జాకెట్స్ కూడా ధరించారని సమాచారం. హోటల్లోని అందరు అతిథులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేసినట్టు బలోచిస్తాన్ సమాచార శాఖ మంత్రి జహూర్ బిలాడీ చెప్పిట్టు దునియా న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది.  అలాగే విదేశీ అతిధులు కూడా ఎవరూ లేరని తెలిపింది. టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు మంత్రి జహూర్ బిలాడీ తెలిపారు.

కాగా దాదాపు 12 ఉగ్రవాసద సంస్థల నిషేధిస్తున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే టెర్రర్‌ దాడి జరిగింది.  మమసూద్ అజర్, హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న 12 సంస్థలపై పాకిస్తాన్ నిషేధం విధించింది. అందులో జైషే మహ్మద్ కూడా ఉంది.

>
మరిన్ని వార్తలు