కశ్మీర్‌లో స్వతంత్ర విచారణకు మద్దతు

14 Jul, 2018 03:54 IST|Sakshi
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్‌

ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరెస్‌ వెల్లడి

ఐక్యరాజ్యసమితి: కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర అంతర్జాతీయ విచారణకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్‌ మద్దతు పలికారు. ఈ విషయంలో మానవ హక్కుల హైకమిషనర్‌ నిర్ణయాలు ఐరాస గొంతును ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర విచారణ జరపాలని ఐరాస మానవ హక్కుల విభాగం హైకమిషనర్‌ ప్రతిపాదించి ఓ నివేదిక రూపొందించారు.

అయితే స్వతంత్ర విచారణ చేయాలన్న ప్రతిపాదనను భారత్‌ ఖండించింది. కాగా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కశ్మీర్‌లలో సాయుధులు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న హింస వల్ల పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అంతర్జాతీయ శాంతిభద్రతకు విఘాతం కలిగించే స్థాయి లేని అంశాలను కూడా ఆ నివేదికలో పేర్కొన్నారని భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

>
మరిన్ని వార్తలు