వైరల్‌ : గుడ్డు పెంకు తీయడం ఇంత ఈజీనా..!

8 Jan, 2020 20:01 IST|Sakshi

ఉడికించిన గుడ్డు(బాయిల్డ్‌ ఎగ్‌) పెంకు తీయడం చాలా కష్టమైన పని. వేడి వేడిగా ఉన్న గుడ్డును తీసుకొని పెంకు తొలగిస్తుంటే చేతులు కాలుతాయి. ఒక్కోసారి పెంకుతో పాటు గుడ్డు కూడా ఊడి వస్తుంది. సరైన పద్దతిలో పెంకు తీయలేక.. అసహనానికి గురవుతాం. కానీ ఇప్పుడు ఈ వీడియో చూశాక మీరు ఈజీగా బాయిల్డ్‌ ఎగ్‌ పెంకు తీయగలరు. ఈ వీడియో ప్రకారం చేస్తే... చేతులు కాలిపోవు, గుడ్డు పగిలిపోదు.

గుడ్లను ఉడికించిన తర్వాత తీసి ఓ గ్లాసులో వేయండి. దాంట్లో కొన్ని చల్లటి నీటిని పోయండి. అనంతరం చేత్తో గ్లాసును మూసి షేక్‌ చేయండి. కొన్ని సెకండ్ల తర్వాత షేక్‌ చేయడం ఆపేసి గుడ్డను బయటకు తీసి పెంకు తీయండి. ఇలా చేస్తే 10 సెంకడ్లలో పెంకును తొలగించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘మంచి ఐడియా.. కానీ నీరు వృధా’, గ్రేట్‌ ఐడియా.. కానీ ట్యాప్‌ కట్టిపెడితే బాగుండు’,‘ ఈ ఐడియాతో లైఫే మారిపోయింది’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా గుడ్డు పెంకు తీయడం ఇంత ఈజీ అని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.  ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఇలా చేసి ఈజీగా బాయిల్డ్‌ ఎగ్‌ పెంకు తీయండి.. హ్యాపీగా తినండి.

మరిన్ని వార్తలు