మంచిర్యాల జిల్లాలో మరోసారి ఉద్రిక్తత

26 Dec, 2017 16:01 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని జన్నారం మండలోని కొత్తపేటతండాపై ఆదివాసీల దాడికి దిగి, గుడిసెలకు నిప్పు పెట్టారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కోలంగూడలో భీమ్‌రావ్‌ అనే వ్యక్తిపై సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు.

ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే లంబాడీలే భీమ్‌ రావ్‌పై దాడికి చేశారని ఆదివాసీ నాయకులు తండాను ధ్వంసం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు తండాలో భారీగా మోహరించారు. ఆదివాసీలు, లంబాడీ నేతలతో  డీసీపీ మనోహర్‌ రావు చర్చలు జరుపుతున్నారు. 
 

మరిన్ని వార్తలు