ఆస్తి పంపకాలపై అమితాబ్ నిర్ణయం

2 Mar, 2017 11:37 IST|Sakshi
ఆస్తి పంపకాలపై అమితాబ్ నిర్ణయం

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన పెద్దరికాన్ని చాటుకున్నారు. ఇప్పటికే మహిళల సమానత్వం విషయంలో పలు ప్రకటనలు చేసిన బిగ్ బి, మహిళాదినోత్సవం దగ్గరికి వస్తున్న తరుణంలో జెండర్ ఈక్వాలిటీపై తన గళం వినిపించారు. సోషల్ మీడియలో యాక్టివ్ గా ఉండే అమితాబ్ ఈ సందర్భంగా ఆసక్తికరమైన పోస్టింగ్ చేశారు. ' నా మరణం తరువాత నేను వదివెళ్లే ఆస్తులు నా కూతురు, కుమారిడికి సమానంగా చెందుతాయి' అని రాసున్న పేపర్ పట్టుకొని దిగిన ఫోటోను ట్విట్టర్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోకు జెండర్ ఈక్వాలిటీ, వియార్ ఈక్వల్ అనే టాగ్ లను జత చేశారు.

గతంలోనూ తన మనవరాలి దుస్తులు విషయంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో అమితాబ్ స్పందన ఆకట్టుకుంది. మహిళలపై ఆంక్షలు విదించటాన్ని నిరసిస్తూ తన మనవారాళ్లకు లేఖరాసిన బిగ్ బీ మీపై ఎలాంటి ఆంక్షలు లేవు.. మా స్టార్ డమ్ మీ స్వేచ్ఛకు అడ్డురాదు. మీకు నచ్చినట్టుగా ఉండండి అంటూ సలహా ఇచ్చారు. అమితాబ్ స్పందన పై పలువురు ప్రముఖుల హర్షం వ్యక్తం చేశారు.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా