-

ఇప్పుడు కేరళ రికార్డ్‌ కూడా!

7 Jun, 2017 00:12 IST|Sakshi
ఇప్పుడు కేరళ రికార్డ్‌ కూడా!

ఈ రికార్డు, ఆ రికార్డు అని లేకుండా ‘బాహుబలి 2’ ఇండియన్‌ సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేసేస్తోన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్‌ వండర్‌.. 50రోజులకు దగ్గరపడుతున్నా, కలెక్షన్ల వర్షం మాత్రం ఎక్కడా  తగ్గించలేదు.

దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో హిట్‌గా నిలిచింది. సోమవారం వరకూ ఒక్క కేరళ మినహా అంతటా ‘బాహుబలి’దే రికార్డు కాగా, నిన్నటితో అక్కడ కూడా ఈ ఫీట్‌ సాధించింది. మళయాల సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన ‘పులి మురుగన్‌’ 70 కోట్ల మేర గ్రాస్‌ వసూళ్లతో ఇంతకుముందు కేరళలో టాప్‌ కలెక్షన్స్‌ పరంగా ఆ రికార్డును ‘బాహుబలి–2’ బ్రేక్‌ చేసింది.