-
ఇప్పుడు కేరళ రికార్డ్ కూడా!
ఈ రికార్డు, ఆ రికార్డు అని లేకుండా ‘బాహుబలి 2’ ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్ చేసేస్తోన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్.. 50రోజులకు దగ్గరపడుతున్నా, కలెక్షన్ల వర్షం మాత్రం ఎక్కడా తగ్గించలేదు. దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో హిట్‌గా నిలిచింది. సోమవారం వరకూ ఒక్క కేరళ మినహా అంతటా ‘బాహుబలి’దే రికార్డు కాగా, నిన్నటితో అక్కడ కూడా ఈ ఫీట్ సాధించింది. మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘పులి మురుగన్’ 70 కోట్ల మేర గ్రాస్ వసూళ్లతో ఇంతకుముందు కేరళలో టాప్ కలెక్షన్స్ పరంగా ఆ రికార్డును ‘బాహుబలి–2’ బ్రేక్ చేసింది. -
నాలుగు భాషల్లో బిజీ బిజీగా...!
పాజిటివ్, నెగటివ్ షేడ్స్ ఉన్న స్టైలిష్ క్యారెక్టర్స్ చేస్తూ, దూసుకెళుతున్నారు జగపతిబాబు. లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో చిత్రాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పాత్రలు చేసిన ఈ వెర్సటైల్ఆర్టిస్ట్ ఈ ఏడాది మలయాళ పరిశ్రమకు పరిచయం కానున్నారు. మోహన్‌లాల్ హీరోగా రూపొందుతున్న ‘పులి మురుగన్’లో విలన్‌గా చేస్తున్నారు. అలాగే, కన్నడంలో ‘జాగ్వార్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సీబీఐ ఆఫీసర్‌గా పాజిటివ్ రోల్ చేస్తున్నారు. తమిళ హీరో విజయ్ నటించనున్న ఓ చిత్రంలో విలన్‌గా నటించడానికి అంగీకరించారు. కొన్ని తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న ‘పులి మురుగన్’ సినిమా ఇప్పటివరకూ మోహన్‌లాల్ నటించిన చిత్రాల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమనీ, కన్నడ ‘జాగ్వార్’ కూడా పెద్ద బడ్జెట్ సినిమానే అనీ జగపతిబాబు అన్నారు. ఇక, విజయ్ సినిమా అంగీకరించడానికి కారణం అది ప్రఖ్యాత విజయా ప్రొడక్షన్స్ నిర్మించనుండటమే అని ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారాయన. ఇంకా జగపతిబాబు మాట్లాడుతూ - ‘‘విజయా సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణిగార్లతో మా నాన్నగారు వీబీ రాజేంద్రప్రసాద్‌కి మంచి అనుబంధం ఉండేది. నాగిరెడ్డిగారి అబ్బాయి వెంకటరామిరెడ్డి ఈ సంస్థపై తీస్తున్న సినిమాలో నటించనుండటం ఆనందంగా ఉంది. పైగా హీరోగా నా మొదటి సినిమా (‘సింహస్వప్నం’) షూటింగ్ ఆరంభమైంది వాహినీ స్టూడియోలోనే. ఆ రోజు తెలుగు, తమిళ పరిశ్రమలకు సంబంధించిన పలువురు ప్రముఖులు వచ్చి, ‘మంచి హీరో అవుతావు’ అని నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడీ సంస్థలో సినిమా ఒప్పుకున్న సందర్భంగా ఆ రోజు గుర్తొస్తోంది’’ అన్నారు. అంతా బాగానే ఉంది.. అన్నీ పెద్ద బడ్జెట్ చిత్రాలే చేస్తున్నారు? చిన్న చిత్రాలు చేయరా? అనే ప్రశ్న జగపతిబాబు ముందుంచితే - ‘‘చిన్న చిత్రాలకు నేనెప్పుడూ వ్యతిరేకం కాదు. నాకు పాత్ర ముఖ్యం. మంచి పాత్ర అయితే చిన్న చిత్రాలు కూడా చేస్తా’’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారీ పారితోషికం తీసుకుంటున్నారట.. మరి చిన్న చిత్రాలకు వెసులుబాటు ఇస్తారా? అనడిగితే - ‘‘వై నాట్. నాకు డబ్బు ముఖ్యం కాదు. నటుడిగా సంతృప్తినిస్తే చేస్తా’’ అన్నారు జగపతిబాబు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement