విశాల్‌ పందికొక్కు లాంటి వాడంటూ..

18 Jun, 2019 09:17 IST|Sakshi

సాక్షి,చెన్నై : సీనియర్ దర్శక దిగ్గజం‌ భారతీరాజా నటుడు విశాల్పై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగటం సంచలనం సృష్టింస్తుంది. నిర్మాతల మండలిలో అధ్యక్షుడిగా విశాల్ వంటి పందికొక్కు దూరిందని, దాన్ని తరిమికొట్టాలని వ్యాఖ్యానించారు. మండలిలో మొలిచిన కలుపు మొక్కను పీకేయాల్సిన బాద్యత మనందరిపై ఉందన్నారు.  నిర్మాతల మండలిలో చేరిన చీడపురుగులను తొలగించాలని బాద్యత మనందరిపై ఉందన్నారు.  

నడిగర్ సంఘం తమిళేతరుల చేతిలో నడుస్తుండటం బాధగా ఉందన్నారు. నడిగర్ సంఘానికి జరిగే ఎన్నికల్లో బాగ్యరాజా టీమ్ ను గెలిపించుకోవటం ద్వారానే తమిళ నటుల ఉనికిని కాపాడుకునే అవకాశం ఉందన్నారు. బాగ్యరాజ్ గెలవగానే దక్షిణాది నటీనటుల సంఘాన్ని తమిళ నటుల సంఘంగా మార్చాలని, నడిగర్ సంఘానికి తమిళనటుల సంఘంగా మార్చటమే తన ద్యేయమని బారతీరాజా వ్యాఖ్యనించటం ఇప్పుడు తమిళ చిత్రసీమలో కలకలం సృష్టిస్తుంది. తమిళ నిర్మాతల‌ మండలి అద్యక్షుడిగా, నడిగర్ సంఘం కార్యదర్శిగా విశాల్ ఉండగా ఆయన్ను టార్గెట్ చేస్తూ బారతీరాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు