సీన్‌ రివర్స్‌

16 Apr, 2018 01:16 IST|Sakshi
బ్రాడ్‌పిట్, జెన్నీఫర్‌ ఆనిస్టన్, జెన్నీఫర్‌ ఆనిస్టన్‌

హాలీవుడ్‌ స్పైస్‌

జస్టిన్‌ థారోస్‌తో జెన్నిఫర్‌ ఆనిస్టన్‌ లాస్ట్‌ మంత్‌ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మరోపక్క జెన్నిఫర్‌ ఫస్ట్‌ హస్బెండ్‌ బ్రాడ్‌ పిట్‌.. ఆంజెలీనా జోలీతో 2016లో డైవర్స్‌ తీసుకొని సింగిల్‌గా ఉంటున్నారు. థారోస్‌తో డైవర్స్‌ తర్వాత జెన్నిఫర్, ఆంజెలినాతో విడాకులు తర్వాత బ్రాడ్‌ పిట్‌.. ఇద్దరూ సింగిల్‌గానే ఉన్నారు, మళ్లీ కలిస్తే బావుండు అని ‘పిట్, జెన్నిఫర్‌’ అభిమానులు కోరుకున్నారు. కానీ సీను రివర్స్‌ అయింది.

జెన్నిఫర్‌ సింగిల్‌గానే ఉన్నారు, కానీ బ్రాడ్‌ పిట్టే మరో అమ్మాయితో మింగిల్‌ అవుతున్నారట. ఎమ్‌ఐటీ ప్రొఫెసర్‌ నెరీ ఓక్స్‌మెన్‌తో  బ్రాడ్‌ పిట్‌ డేట్‌ చేస్తున్నారని హాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. ఆర్ట్, ఆర్కిటెక్చర్‌ డిజైన్‌లో నెరీ ఓక్స్‌మెన్‌ రాక్‌స్టార్‌ అని చెప్పవచ్చు. ఎమ్‌ఐటీలో నెరీ గీసిన ఓ త్రీడీ పెయింటింగ్‌ చూసి ఫ్లాట్‌ అయ్యారట బ్రాడ్‌ పిట్‌. అప్పటినుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారన్నది హాలీవుడ్‌ ఓపెన్‌ సీక్రెట్‌. సో జెన్నీఫర్, పిట్‌ మళ్లీ కలుస్తారనుకున్న అభిమానుల కోరిక నేరవేరనట్టే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా