ఆ హీరోయిన్‌ పెళ్లి ముహూర్తం ఖరారు

22 Dec, 2017 09:11 IST|Sakshi

లైంగిక వేధింపుల కేసుతో ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రముఖ దక్షిణ భారత సినీ  హీరోయిన్‌ భావన( కార్తికా మీనన్)పెళ్లి తేదీ ఖరారైంది. చిరకాల మిత్రుడు, శాండిల్‌వుడ్ ప్రొడ్యూసర్ నవీన్‌తో భావన మార్చి 9న ఎంగేజ్‌మెంట్  జరుపుకున్న సంగతి విదితమే. నిశ్చితార్థం జరిగి ఇన్నాళ్ల గ్యాప్‌ తరువాత  జనవరి 22న వీళ్ల వివాహం బెంగళూరులో జరగనుంది.  త్రిసూర్ లోని 'లలు కన్వెన్షన్ సెంటర్'లో వీళ్లు పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే సన్నిహిత మితృలకు, బంధువులకు ఆహ్వానాలు అందాయి.

 తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లోనటించిన భావన నమోదు చేసిన నటుడు దిలీప్‌పై లైంగిక వేధింపుల కేసు కేరళ చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో  పెళ్లిని  సినీ పరిశ్రమకు దూరంగా జరుపుకోనున్నారు.  కేవలం కొంతమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్‌  చేసినట్టు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు