పాకిస్థాన్ నటితో జతకడుతున్నా

9 Oct, 2015 18:06 IST|Sakshi
పాకిస్థాన్ నటితో జతకడుతున్నా

మరో పాకిస్థానీ నటి బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతోంది. అది కూడా వాళ్లు, వీళ్ల పక్కన కాదు.. కింగ్ ఖాన్ సరసన! రయీస్ సినిమాలో తన సరసన పాకిస్థానీ నటి మహీరా ఖాన్ నటిస్తోందని షారుక్ ఖాన్ చెప్పాడు. ఈ క్రైం థ్రిల్లర్ సినిమాలో తామిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుందని ఆశిస్తున్నానన్నాడు. పాకిస్థాన్లో ప్రాచుర్యం పొందిన 'హమ్సఫర్' అనే షోలో ప్రధాన పాత్రతో అందరినీ ఆకట్టుకున్న మహీరా.. తన సినిమాలో నటిస్తున్న విషయాన్ని షారుక్ నిర్ధరించాడు.

రయీస్లో తమ జోడీ కచ్చితంగా బాగుంటుందని షారుక్ అన్నాడు. దాంతో ఎంతో సంబరపడిపోయిన మహీరా.. మీరు, మీ కుటుంబం అంతా బాగున్నారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేసిందట. రాహుల్ ఢోలకియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఓ లిక్కర్ కింగ్ పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈద్ నాటికి సినిమా విడుదల అవుతుందని, అదే సమయంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సుల్తాన్' కూడా విడుదల కానుంది.

>