లారెన్స్‌కు మదర్‌ థెరిసా అవార్డు

12 Sep, 2018 21:44 IST|Sakshi

సాక్షి, చెన్నై : ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకనిర్మాత రాఘవ లారెన్స్‌ విశ్వశాంతికి పాటు పడిన మదర్‌ థెరిసా అవార్డు పురస్కారాన్ని అందుకోనున్నారు. మదర్‌ ధెరిసా 108వ జయంతిని పురస్కరించుకుని చెన్నైలోని మదర్‌ థెరిసా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు ఉత్తమ సేవలను అందించిన వారిని మదర్‌ థెరిసా అవార్డుతో సత్కరించనున్నారు. అందులో భాగంగా పలు సాయాజిక సేవలను నిర్వహిస్తున్న నటుడు రాఘవ లారెన్స్‌ను మదర్‌ థెరిసా అవార్డుతో సత్కరిచంనుంది. ఈ అవార్డు ప్రధానోత్సవ వేడుక గురువారం సాయంత్రం చెన్నై, తేరనాపేటలోని కామరాజర్‌ ఆవరణలో జరగనుంది.

ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్మావి, తమిళనాడు కాంగ్రేశ్‌ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసన్, కాంగ్రేస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇవీకేఎస్‌. ఇళంగోవన్, పీఎంకే పార్టీ యవజన విభాగం అధ్యక్షుడు అన్బుమణి రామదాస్, వసంతకుమార్‌తో పాటు పలువురు ముఖ్య అతిధులుగా విశ్చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మదర్‌ థెరిసా చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పలు సేవాకార్యక్రమాలను నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు