క్వారంటైన్ సెంటర్ నుంచి 100 మంది ప‌రారీ

17 Jul, 2020 15:50 IST|Sakshi

గువ‌హ‌టి :  త‌మ‌కు స‌రైన ఆహ‌రం, నీళ్లు అందించ‌డం లేదంటూ క‌రోనా రోగులు ఆందోళ‌న‌కు దిగారు. క్వారంటైన్ సెంట‌ర్ నుంచి 100కు పైగా క‌రోనా రోగులు పారిపోయి జాతీయ ర‌హ‌దారిపై బైఠాయించారు. ఈ ఘ‌ట‌న అసోంలోని కామ్‌రూప్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే గ‌దిలో 10 నుంచి 12మందిని ఉంచుతున్నార‌ని, భౌతి​క దూరం ఎలా పాటించాలని ప్ర‌శ్నించారు. త‌మ‌కు స‌రైన ఆహ‌రం ఇవ్వ‌కుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ క‌రోనా రోగులు జాతీయ ర‌హ‌దారిపై నిర‌స‌న చేప‌ట్టడంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. వెంట‌నే రంగంలోకి దిగిన డిప్యూటీ కమిషనర్ కైలాష్ కార్తీక్‌.. పై అధికారుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని, స‌రైన వ‌స‌తులు క‌ల్పిస్తామని హామీ ఇవ్వ‌డంతో రోగులు తిరిగి క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు. 
(పక్కా ప్లాన్‌తో ప్రియుడితో కలిసి క్వారంటైన్‌కు..)

ఈ ఘ‌ట‌న ఆరోగ్య శాఖ మంత్రి హిమంత భిశ్వ శర్మ మాట్లాడుతూ.. ఒక‌వేళ క్వారంటైన్ సెంట‌ర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటే వారు ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉండొచ్చ‌ని పేర్కొన్నారు. సాధ్య‌మైనంత‌గా సౌక‌ర్యాల లేమి లేకుండా చూసేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని తెలిపారు. ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు ప‌గ‌లు, రాత్రి అనే తేడా లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారని అన్నారు. అంతేకాకుండా వేరే రాష్ర్టాల‌తో పోలిస్తే  ఆర్థిక భారం అయిన‌ప్ప‌టికీ  అస్సాంలోనే క‌రోనా  టెస్టులు ఉచితంగా నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. (కరోనాతో మాజీ సీనియర్‌ అధికారి, రచయిత్రి మృతి)

మరిన్ని వార్తలు