షెల్టర్‌ హోంలో ఇద్దరు మహిళల మృతి

13 Aug, 2018 03:49 IST|Sakshi

పట్నా: బిహార్‌ రాజధాని పట్నాలోని ఓ మానసిక వికలాంగుల కేంద్రంలో ఇద్దరు మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. నేపాలినగర్‌లోని ‘ఆసరా’ అనే షెల్టర్‌హోంలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రి వర్గాలు, ప్రభుత్వం వేర్వేరు కారణాలు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. 17, 40 ఏళ్లున్న ఇద్దరు మహిళలను ఆగస్టు 10 అర్ధరాత్రి దాటిన తరువాత ఆసుపత్రి తీసుకెళ్లగా, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంగతిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమైన షెల్టర్‌ హోం, ఆసుపత్రి వర్గాలపై పట్నా ఐజీ ఎన్‌హెచ్‌ ఖాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు, వారికి చికిత్స జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలోనే చనిపోయారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. ఆ హోం లో వారిని పారిపోవాలంటూ బహుమతులు ఆశచూపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసిన తరువాతి రోజే ఇద్దరు మృతిచెందారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు