ఎస్‌ఎస్‌సీ పరీక్షలో హైటెక్‌ మోసం: నలుగురి అరెస్టు

29 Mar, 2018 10:28 IST|Sakshi

న్యూఢిల్లీ : సీబీఎస్‌ఈ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారాన్ని మరవకముందే మరో షాకింగ్‌ వ్యవహారం బయటపడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్టాఫ్ట్‌ సెలక్షన్‌ కమీషన్‌(ఎస్‌ఎస్‌సీ) పరీక్షలో హైటెక్‌ మోసానికి సంబంధించిన వ్యవహారం వెలుగుచూసింది. పక్కా ప్రణాళికతో మోసానికి పాల్పడుతున్న హైటెక్‌ రాకెట్‌ ముఠాకు చెందిన నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ. 50లక్షల సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజయ్‌(30), సోను(31), గౌరవ్‌(24), పరంజీత్‌(24) అనే నలుగురు ఆన్‌లైన్‌ పరీక్ష తప్పకుండా పాస్‌ చేయిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి రూ. 5 - 10లక్షల వరకూ సొమ్మును వసూలు చేసినట్లు చెప్పారు. టీమ్‌ వ్యూయర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఈ నలుగురు ఎస్‌ఎస్‌సీ వారు నిర్వహిస్తున్న సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌-1 పరీక్షలో మోసానికి పాల్పడ్డారు.

ఈ వ్యవహారానికి సూత్రధారి ఢిల్లీ సేల్స్‌ టాక్స్‌ డిపార్టమెంట్‌లో పనిచేస్తున‍్న హర్‌పాల్‌గా పోలీసులు గుర్తించారు. హర్‌పాల్‌కు ఈ ముఠాతో సంబంధం ఉందని మీర్‌పుత్‌ పోలీసులకు సమాచారం అందడంతో వారు  ఉత్తర ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ పోలీసులతో కలిసి హర్‌పాల్‌ ఇంటిమీద దాడిచేశారు. ఇంత కాలం మాన్యువల్‌గా నిర్వహించిన ఈ పరీక్షలో అవకతవకలకు అవకాశం ఉండకూడదనే ఉద్దేశంతో గత కొంతకాలం నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు