'అజాంఖాన్కు సుప్రీం మొట్టికాయలు'

29 Aug, 2016 12:19 IST|Sakshi

న్యూఢిల్లీ: బులంద్ షహర్లో చోటుచేసుకున్న లైంగిక దాడి ఘటన విషయంలో ఉత్తరప్రదేశ్ మంత్రి అజాం ఖాన్కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఒక మంత్రి స్థాయి వ్యక్తి అలాంటి ఆరోపణలు చేయడం అనుచితం అని పేర్కొంది. బాధ్యతారాహిత్యంగా మంత్రి ఆ వ్యాఖ్యలు చేసినట్లుందని అభిప్రాయపడింది. అంతేకాదు.. 'మీపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదో చెప్పాలని' ప్రశ్నిస్తూ మంత్రి అజాం ఖాన్కి నోటీసులు పంపించింది. 'న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల నమ్మకం సన్నగిల్లేలా అధికారంలో ఉన్న వ్యక్తులుకానీ, అధికార సంస్థగానీ అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారసలు' అని సుప్రీంకోర్టు ఆ నోటీసుల్లో ప్రశ్నించింది.

ఈ నెల(ఆగస్టు) తొలివారం బులంద్ షహర్ జాతీయ రహదారి 91పై వెళుతున్న ఓ కుటుంబంపై దాడి చేసి అందులోని గృహిణి ఆమె పదమూడేళ్ల కూతురుపై కొంతమంది దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. వీటిని ఖండించే క్రమంలో ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తున్నారని, ఈ ఘటన ఒక రాజకీయ కుట్ర అని అజాంఖాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు నేడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు