ఆరోపణలు చేసేప్పుడు క్లారిటీ అవసరం: రిజిజు

17 Nov, 2016 19:44 IST|Sakshi
ఆరోపణలు చేసేప్పుడు క్లారిటీ అవసరం: రిజిజు

​షిల్లాంగ్‌: పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణల విషయంలో ముందుగా కాంగ్రెస్‌ పార్టీకి ఒక క్లారిటీ లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి తికమకకు గురికాకుండా ఒక స్పష్టతకు రావాల్సిన అవసరముందని మేఘాలయలో జరిగిన ఓ కార్యక్రమంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు.

‘నోట్ల రద్దు విషయంపై కనీసం ఆర్థిక మంత్రికి కూడా చెప్పకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేశారని ఒకసారి.. ప్రకటనకు ముందే ప్రధాని నోట్లరద్దు విషయాన్ని లీక్‌ చేశారని ఇంకోసారి కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు’ అని రిజిజు అన్నారు. ఏవైనా ఆరోపణలు చేసేటప్పుడు ఒక స్పష్టత అవసరమని ఆయన కాంగ్రెస్‌ నేతలకు సూచించారు.

>
మరిన్ని వార్తలు