జర్నలిస్టులకూ బీమా వర్తింపు

3 May, 2020 15:16 IST|Sakshi

మమామ్మారిపై పోరాడే  సిబ్బందికి బీమా

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న జర్నలిస్టులు సహా  వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు రూ పది లక్షల బీమాను వర్తింపచేస్తామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా నిలిచే మీడియా స్వతంత్రంగా నిర్భయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, సమాజానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. భావ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కరోనాపై ముందుండి పోరాడే వారితో పాటు జర్నలిస్టులకూ బీమా సౌకర్యం వర్తింప చేస్తామని ఆమె వెల్లడించారు.

చదవండి : మమత X గవర్నర్‌

>
మరిన్ని వార్తలు