యూపీ ఎన్నికల్లో బీజేపీదే హవా?

13 Oct, 2016 10:13 IST|Sakshi
యూపీ ఎన్నికల్లో బీజేపీదే హవా?

వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 170-183 స్థానాలను గెలుచుకుంటుదని తాజా సర్వేలో తేలింది. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని అంటున్నారు. అయితే, ఇండియా టుడే - యాక్సిస్ నిర్వహించిన మరో సర్వేలో మాత్రం.. హంగ్ అసెంబ్లీ వస్తుందని అన్నారు. ఆ సర్వే ప్రకారం బీఎస్పీ 115-124 సీట్లతో రెండోస్థానంలో నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి 94-103 స్థానాలు మాత్రమే వస్తాయని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, 8-12 సీట్లకు మించి గెలుచుకునే పరిస్థితి లేదని అంటున్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థులలో మాత్రం మాయావతికే పెద్దపీట వేస్తున్నారు. ఆమె సీఎం కావాలని 31 శాతం మంది చెబితే, అఖిలేష్ మళ్లీ సీఎం కావానేవాళ్లు 27 శాతమే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్, షీలాదీక్షిత్‌లకు కేవలం ఒక్కోశాతం మద్దతు మాత్రమే వచ్చింది. అదే ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామంటే మాత్రం ఆమెకు 2 శాతం మంది మద్దతు చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు 18 శాతం మంది, యోగి ఆదిత్యనాథ్‌కు 14 శాతం మంది అండగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశాలుగా రామ మందిరం, గో సరంక్షణ కనిపిస్తున్నాయి. 2012 ఎన్నికల తర్వాత యూపీలో దళితులపై దాడులు పెరిగాయని 54 శాతం మంది ముక్తకంఠంతో చెప్పారు.

మరిన్ని వార్తలు