జాతీయ నాయకులు మళ్లీ పుట్టారు!

13 Jan, 2020 14:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలో జాతీయ నాయకులు మళ్లీ పుట్టారు. చరిత్ర పుటలకే పరిమితమైన వారి చిత్రాలు, బోధనలు ప్లకార్డుల ద్వారా ఆందోళనలో మళ్లీ ఊపరి పోసుకున్నాయి. ముఖ్యంగా యువత వారి బోధనలను నినాదాలుగా ప్రజల్లోకి మళ్లీ తీసుకొచ్చారు. అలాంటి జాతీయ నాయకులో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌లు ముందున్నారు. జాతి, మత, కుల భేదాలు లేకుండా ముఖ్యంగా హిందూ, ముస్లిలు కలసిమెలసి శాంతి, సామరస్యాలతో జీవించాలంటూ గాంధీ ఇచ్చిన పిలుపును గుర్తు చేస్తున్నారు. ఆయన రామ రాజ్యాన్ని కోరుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దేశ స్వాతంత్య్రానంతరం జరిగిన హిందూ, ముస్లిం అల్లర్లలో బెంగాల్లో బాధితులను పరామర్శించిన గాంధీ ‘ప్రజలు మనసు మార్చుకోవాలి’ అంటూ ఇచ్చిన పిలుపును పునరుద్ఘాటిస్తున్నారు.

ఇంతకుముందు లైబ్రరీలకు, వీధి కూడళ్లకు మాత్రమే పరిమితమైన అంబేడ్కర్‌ ఫొటోలు నేడు యువత చేతుల్లో దర్శనమిస్తున్నాయి. ‘మన అద్భుతమైన రాజ్యాంగం’ అన్న నినాదాలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగం ముందు మాటలో పేర్కొన్న ‘లౌకికవాదం’కు నిజమైన అర్థం కావాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఒక్క జాతీయ నాయకులే కాకుండా ఇటీవల ఢిల్లీలో ఓ పోలీసుల లాఠీచార్జి నుంచి తప్పించేందుకు ఓ విద్యార్థి చుట్టూ నలుగురు విద్యార్థినిలు రక్షణ కవచనంలా నిలబడి రక్షించిన ‘హీరోల’ ఫొటోలు కూడా ప్రదర్శనల్లో కనిపిస్తున్నాయి. (చదవండి: ఎవరి పౌరసత్వమూ రద్దు కాదు)

మరిన్ని వార్తలు