విదేశీ విద్యార్థుల్లో నేపాలీలదే పైచేయి 

25 Sep, 2019 03:19 IST|Sakshi

భారత్‌లో చదువుకుంటున్న 164 దేశాలకు చెందిన 47 వేల మంది 

ఉన్నత విద్యకు కర్ణాటకకే ఓటు

న్యూఢిల్లీ: మన దేశానికి ఉన్నత విద్యనభ్యసించడానికి వచ్చే విదేశీయుల్లో నేపాల్, అఫ్గానిస్తాన్‌ విద్యార్థులు మొదటి రెండు స్థానాల్లో నిలుస్తున్నారని కేంద్రం వెల్లడించింది. విదేశీయుల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువమంది ఇక్కడికి వస్తున్నారని, అత్యధికులు బీటెక్, ఆ తర్వాత బీబీఏ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారని మానవ వనరుల అభివృద్ధి శాఖ చేపట్టిన ఆల్‌ ఇండియా సర్వే ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌లో వెల్లడైంది. ప్రస్తుతం దేశంలోని వివిధ విద్యా సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 164 దేశాలకు చెందిన 47,427 మంది చదువుకుంటున్నారని తెలిపింది.

వీరిలో అత్యధిక శాతం కర్ణాటకలో చదివేందుకు ఇష్టపడుతున్నట్లు వెల్లడైంది. విదేశీ విద్యార్థుల్లో 73.4 శాతం మంది అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు, 16.15 శాతం మంది పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదువుతున్నారు. బీటెక్‌ చదువుతున్న 8,861 మందిలో 85 శాతం మంది అబ్బాయిలే. ఆ తర్వాత బీబీఏ (3, 354), బీఎస్‌సీ(3,320), బీఏ(2,26)తోపాటు బీఫార్మా, బీసీఏ, ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులు ఉన్నాయి. 2018–19లో చేపట్టిన ఈ సర్వేలో 962 వర్సిటీలు, 38,179 కళాశాలలు, 9,190 ఇతర సంస్థలు పాల్గొన్నాయి. 

>
మరిన్ని వార్తలు