ఇక మీ వంతు..

4 Oct, 2017 17:43 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: మండుతున్న పెట్రో ధరలను తగ్గించేందుకు ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం ద్వారా తాము చేయగలిగింది చేశామని, ఇక రాష్ట్రాలూ పెట్రోల్‌పై వ్యాట్‌ను 5 శాతం తగ్గిస్తే ప్రజలకు భారీ ఊరట కలుగుతుందని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. వినియోగదారుల ప్రయోజనాల కోసం కేంద్రం తరహాలో రాష్ట్రాలూ తమ బాధ్యతను నెరవేర్చాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ఇంధనంపై వ్యాట్‌ను తొలగించేలా అన్ని రాష్ట్రాలను కోరుతూ ఆర్థిక మంత్రి లేఖలు రాస్తారని చెప్పారు. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపుతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ 2.5, రూ 2.25 మేర తగ్గిన విషయం విదితమే. గత మూడు నెలలుగా పెరుగుతున్న పెట్రో ధరలకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం మంగళవారం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ 2 తగ్గించింది. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర పన్నులు గణనీయంగా తగ్గితేనే వీటి ధరలు పూర్తిగా అదుపులోకి వస్తాయి.

మరిన్ని వార్తలు