పండుగల సీజన్‌లో ప్రయాణికులకు చార్జీల షాక్

3 Oct, 2014 01:56 IST|Sakshi

50శాతం తత్కాల్ కోటాకు డివూండ్  
ప్రాతిపదికన  పెరిగిన చార్జీలు

 
న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో రైల్వే ప్రయూణికులకు ఇది చేదువార్త. దేశవ్యాప్తంగా 80రైళ్లలోని తత్కాల్‌కోటా టికెట్లలో సగం టికెట్ల ధరలు గణనీయుంగా పెరిగాయి. ప్రయూణికుల డివూండ్ ప్రాతిపదికగా, తత్కాల్ టికెట్లలో సగం కోటాను ‘డైనమిక్ ఫేర్ సిస్టమ్’ పరిధిలోకి తేవాలని రైల్వేశాఖ నిర్ణరుుంచడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పండుగల సీజన్ వుధ్యలో ప్రయూణికుల రద్దీని సొవుు్మచేసుకోవడం ద్వారా రైల్వే ఆదాయూన్ని పెంచుకోవడమే లక్ష్యంగా రైల్వేశాఖ ఈ నిర్ణయుం తీసుకుంది.

తత్కాల్ కోటాలోని తొలి 50శాతం టికెట్లు ప్రస్తుత చార్జీలతోనే బుకింగ్ జరిగాక, మిగిలిన 50శాతం టికెట్లకు ప్రీమియుం ధరలను వర్తింపజేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియుర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ నెలలోనే అవులులోకి వచ్చిన ‘ప్రీమియుం తత్కాల్ టికెట్’ పథకాన్ని ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచినట్టు రైల్వే బోర్డు (ట్రాఫిక్) సభ్యుడు డీపీ పాండే చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన 80రైళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నావున్నారు. ఇందుకోసం ఒక్కో జోన్‌లో ఐదేసి రైళ్లను గుర్తించాలని ఆయూ రైల్వే జోన్లను ఆదేశించినట్టు చెప్పారు. బ్లాకులో టికెట్లు విక్రయూనికి పాల్పడేవారి బెడదను అరికట్టేందుకే ఈ కొత్త చార్జీల వ్యవస్థను వర్తింపజేస్తున్నట్టు రైల్వే శాఖ చెబుతోంది.  హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హజరత్ నిజావుుద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సికిందరాబాద్-హౌరా ఫలక్‌నువూ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-బెంగళూరు ఎక్‌ప్రెస్, సికిందరాబాద్-పాట్నా ఎక్‌ప్రెస్‌లకు కూడా ఈ పథకం వర్తింపజేస్తున్నారు.
 
‘డైనమిక్ ఫేర్ సిస్టమ్’ అంటే: ‘డైనమిక్ ఫేర్ సిస్టమ్’ ప్రకారం తత్కాల్ కోటాలో తొలి 50శాతం టికెట్లు ప్రస్తుత రేట్లతోనే బుక్ చేస్తారు. తదుపరి 10శాతం టికెట్లకు 20శాతం ఎక్కువగా చార్జీ వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక ‘థర్డ్‌ఏసీ’ రైల్వేబోగీలో 60సీట్లు అందుబాటులో ఉంటే, వాటిలో 30టికెట్లకు సాధారణమైన తత్కాల్ చార్జీలు వర్తిస్తారుు. మిగిలిన 30సీట్లలో పదిశాతం సీట్లకు, అంటే 3సీట్లకు, 20శాతం ఆదనపు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఆ తర్వాత మిగిలిన 27 సీట్లకు ఇదే పద్ధతిలో, 20శాతం అదనపు చార్జీ వర్తిస్తూపోతుంది.

మరిన్ని వార్తలు