‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’ పుస్తక ఆవిష్కరణ

21 Feb, 2020 13:32 IST|Sakshi

న్యూఢిల్లీ: కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఇప్పటికీ ప్రాసంగికత ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, లెఫ్ట్‌వర్డ్ సంపాదకుడితో కలిసి రాఘవులు శుక్రవారం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ సిద్దాంతాలు యువతలోకి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇక సీపీ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21ను రెడ్‌బుక్‌ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. లక్ష పుస్తకాలు ప్రింట్‌ చేశామని.. ఆరెస్సెస్‌కు గట్టి జవాబుగా కమ్యూనిస్టు మేనిఫెస్టో ఉందటుందని పేర్కొన్నారు. ‘‘ప్రజల చేతిలో ఆయుధం ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టో. ప్రపంచవ్యాప్తంగా రైట్‌వింగ్‌ సిద్ధాంతాలు వస్తున్నాయి. ఇవి చాలా ప్రమాదకరం. ఫ్రీ థింకింగ్‌, ఫ్రీ థాట్‌, అసమ్మతి తెలియజేయడం అనేది చాలా ముఖ్యం’అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు