క్రెడిట్, డెబిట్ కార్డు సర్‌చార్జీలపై వైఖరేంటి?

20 Aug, 2016 01:46 IST|Sakshi
క్రెడిట్, డెబిట్ కార్డు సర్‌చార్జీలపై వైఖరేంటి?

న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలపై విధిస్తున్న సర్‌చార్జీలపై వస్తున్న ఫిర్యాదులపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. సక్రమంగాలేని సర్‌చార్జీల విషయంలో నిర్ణీత గడువులోగా తమ వైఖరేంటో చెప్పాలని కేంద్ర ఆర్థిక శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)లను ఆదేశించింది.  నగదు చెల్లింపుల్లో ఎలాంటి పన్ను లేదని, కార్డుల ద్వారా లావాదేవీలపై మాత్రం 2.5 శాతం, అంతకుమించి సర్‌చార్జీలు విధిస్తున్నారని పిటిషన్ వేసిన న్యాయవాది అమిత్ సాహ్ని తెలిపారు.

మరిన్ని వార్తలు