ఆయనను అలా చూడటం కష్టంగా ఉంది: స్టాలిన్‌

28 Jan, 2020 10:33 IST|Sakshi

చెన్నై: జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్‌ 370)ని కేంద్రం గతేడాది ఆగస్టులో తొలగించడం తెల్సిందే. అప్పట్నుంచి కశ్మీర్‌ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్‌ కూడా ఉన్నారు. దాదాపు ఐదు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న ఆయన ఫొటో ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో యువకుడిలా ఉండే ఒమర్‌ అబ్దుల్లా బారు గడ్డంతో చిరునవ్వు చిందిస్తున్న ఓ ఫోటో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 

(ఆ ఫోటో చూసి షాకయ్యాను : మమత)

రాజకీయ ప్రముఖులు ఎవరూ ఆ ఫొటోలో ఉన్నది ఒమర్ అంటే నమ్మలేకపోయారు. ఒమర్‌ను తాను గుర్తుపట్టలేకపోయానని ఈ మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ట్వీట్ చేశారు. తాజాగా.. డీఎంకే చీఫ్ స్టాలిన్ ఈ ఫొటోపై స్పందించారు. ఒమర్‌ను అలా చూడడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితర నేతల పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు