ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి: చాడ

3 Mar, 2018 05:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌–భద్రాచలం సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలాన్ని గోప్యంగా ఉంచడం, మీడియాను అనుమతించకపోవడం, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాల నిరంకుశ, నియంత్రత్వ విధానాలకు నిదర్శనమన్నారు. నెత్తుటి మరక ఉండని తెలంగాణ అంటే ఇలాంటి పాలనేనా అని ప్రశ్నించారు.  

సుప్రీం జడ్జితో విచారణ చేయించాలి
ఎన్‌కౌంటర్‌పై సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ చంద్రన్న డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం ఈ మేరకు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై ఐపీసీ 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు