ఆ యువతి నిజంగా ఐఏఎస్‌ టాపరేనా, ఇంతకీ ఎవరామె?

2 Jul, 2020 20:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌మీడియాలో చాలా మందికి ఆదర్శంగా నిలిచే ఒక వార్త మూడు సంవత్సరాలుగా  చక్కర్లు కొడుతోంది. కర్ణాటక గ్రామీణ ప్రాంతానికి చెందిన రేవతి అనే ఒక పేద కుటుంబానికి చెందిన యువతి ఐఏఎస్ పరీక్షలో మూడో ర్యాంక్‌  సాధించిందనేది ఆ వార్త సారాంశం. ఒక పూరింటి ముందు ఆమె అమ్మ,నాన్న ఆనందంతో స్వీట్‌ తినిపిస్తున్న ఫోటో సోషల్‌ మీడియాలో చాలా కాలంగా షికార్లు చేస్తోంది. ఈ ఫోటోను పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నేత అమితవ చక్రవర్తి తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసి ఆమె ఎందరికో ఆదర్శమంటూ కొనియాడారు. (అవాక్కయ్యే వీడియో.. అంతపైకి బైక్‌)

అయితే ఈ ఫోటోలో ఉన్న యువతి ఆంధ్రప్రదేశ్‌ కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన వెంకట రేవతిగా తేలింది. రాజమండ్రి దిశా పోలీస్టేషన్‌లో ప్రస్తుతం ఆమె సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆ ఫోటో 2017లో రేవతి ఎ‍స్సై ఉద్యోగానికి ఎంపికయినప్పుడు తీసినది. దీని గురించి రేవతి మాట్లాడుతూ, ‘ఆ ఫోటోలో ఉన్నది నేనే.  ప్రస్తుతం రాజమండ్రిలోని దిశా పోలీస్టేషన్‌లో నేను ఎ‍స్సైగా పనిచేస్తున్నాను. అది నేను ఎస్సై ఉద్యోగానికి ఎంపికయినప్పుడు తీసుకున్న ఫోటో. నేను సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను అంతే కానీ ఐఏఎస్‌ను కాను. నేను అసలు సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు ఎప్పుడూ హాజరుకాలేదు’ అని తెలిపారు. బూమ్‌ న్యూస్‌ చేసిన ఫ్యాక్ట్‌ చెక్‌లో ఈ విషయాలు బయటపడ్డాయి. (భారత్‌లో గూగుల్‌ పే బ్యాన్‌? ఎన్‌పీసీఐ క్లారిటీ)

మరిన్ని వార్తలు