బిడ్డ ప్రాణాన్ని కాపాడిన తండ్రి ఆరాటం

20 Jun, 2020 17:40 IST|Sakshi

తిరువనంతపురం(కేరళ): మనం గెలిస్తే పది మందికి చెప్పుకొని మనం ఓడిపోయి ఒంటరిగా మిగిలితే మన భుజం తట్టి ప్రోత్సహించేవాడు నాన్న. మన భాద్యతను తను బతికున్నంత కాలం తీసుకునేవాడు నాన్న. ఫాదర్స్‌ డే సందర్భంగా తన కూతురి కోసం ఎంతో పోరాటం చేసి గెలిచిన ఓ నాన్న కథను తెలుసుకుందాం. అతని పేరు ఎస్‌ బైజు. తిరువనంతపురానికి చెందిన బైజుది రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం. అతని 8 సంవత్సరాల కూతురు అబిన బైజు ఆరోగ్యం పాడై అసుపత్రిలోచేరింది.  

(ఫాదర్స్‌ డే ఎలా వచ్చిందో తెలుసా!)

అసలే లాక్‌డౌన్‌ కారణంగా మూడునెలల నుంచి పనిదొరక్క అల్లాడిపోతున్న అతడిపై పిడుగుపడినట్లు తన కూతురి కాలేయం పాడైందని, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ తండ్రి ఎక్కని మెట్టులేదు, తొక్కని గడపలేదు. కానీ ఏ ఒక్కరూ అతని బాధను పంచుకోవడానికి ముందుకు రాలేదు. తన కూతురుకు సరిపోయే లివర్‌ దొరికిందని వెంటనే మారిస్తే పాప బతుకుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యులు చెప్పారు. కానీ చేతిలో పైసా లేని ఆ తండ్రి ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరుగా విలపించాడు. అప్పుడు అక్కడే ఉన్న ఒక నర్సు క్రౌండ్‌ ఫండింగ్‌ సంస్థ గురించి  తెలిపింది. దీంతో మిలాప్‌ క్రౌండ్‌ ఫండింగ్‌ సంస్థను అతడు కలిశాడు.

(రేపొక్క రోజే ఏడు రోజులు)

పాప ఆపరేషన్‌కు రూ. 20 లక్షలు అవసరం కాగా మిలాప్‌ సంస్థ రూ. 11,81,325 అందించింది. కొంత మంది దాతలు మరికొంత సాయం చేశారు. మిగిలిన డబ్బును పాపను చేర్పించిన కొచ్చి అస్టర్‌ మెడిసిటీ ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వడానికి అంగీకరించింది. పాపను 21రోజుల పాటు ఐసీయూలో ఉంచారు. పాపకు మే మొదటివారంలో ఆపరేషన్‌ చేయగా మూడు వారాల పాటు  ఐసీయూలో ఉంచారు. మరో మూడు నెలలు పాప ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. తన బిడ్డను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో  తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి బైజు ధన్యవాదాలు తెలిపాడు. 

మరిన్ని వార్తలు