సుప్రీంలో తొలిసారి ఏకసభ్య ధర్మాసనాలు

14 May, 2020 14:36 IST|Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తొలిసారి మూడు ఏకసభ్య ధర్మాసనాలు ఒకేరోజు 20 చొప్పున కేసులను విచారించి తీర్పులిచ్చాయి. బుధవారం జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ రవింద్ర భట్, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లు వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ విచారణలు జరిపారు. ఒక్కొక్కరు సుమారు 20 ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్ల(కేసుల విచారణను ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు మార్చాలనే వినతి)ను విచారించి, తదనుగుణంగా ఉత్తర్వులిచ్చారు. కేసుల భారాన్ని తగ్గించుకునేందుకు గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు రూల్స్‌ బుక్‌లోని పలు నిబంధనలను మార్చింది. ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలకు సంబంధించిన ముందస్తు బెయిల్‌ కేసులను ఏకసభ్య ధర్మాసనాలు విచారించవచ్చని పేర్కొంది. (వారిని ఎందుకు విమర్శించరు?)

>
మరిన్ని వార్తలు