'అత్యాచార' వ్యాఖ్యలను సమర్ధించిన మంత్రి

7 Apr, 2015 11:35 IST|Sakshi
'అత్యాచార' వ్యాఖ్యలను సమర్ధించిన మంత్రి

పనాజీ: పిల్లల్ని కాన్వెంట్ స్కూల్ కు పంపుతూ పాశ్యాత్య సంస్కృతికి అలవాటు పడటం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయన్న భార్య లలిత వ్యాఖ్యలను గోవా మంత్రి దీపక్ ధవలికర్ సమర్ధించారు. ఆయన భార్య లలిత చేసిన అత్యాచార వ్యాఖ్యలపై మంత్రి ఈ విధంగా స్పందించారు. నేటి పిల్లల డ్రెస్ లను ఒకసారి పరిక్షించండి అంటూ ఆమె చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు మరింత ఆజ్యం పోశారు. మహిళలు డ్రెస్ లు విషయంలో సరిగా లేకపోవడం వల్లే అత్యాచారాలు జరగడానికి ప్రధాన కారణమన్నారు.'ఒకసారి చూడండి. ప్రజల్లో పూర్తిగా మార్పులు చూస్తున్నాం. వారి పద్ధతుల దగ్గర్నుంచి డ్రెస్ విషయంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఆ క్రమంలోనే రేప్ లో కూడా పెరుగుతున్నాయంటూ భార్య వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు.

 

అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతికి మహిళలు దూరంగా ఉండాలని మంత్రి భార్య లలిత ఉచిత సలహా ఇచ్చి వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే.  సనాతన్ సంస్థలో పనిచేస్తున్న ఆమె మార్గావ్ లో ఆదివారం జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు .అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతికి మహిళలు దూరంగా ఉండాలన్నారు. హిందూ పురుషులు బయటకు వెళ్లేటప్పుడు విధిగా తిలకం పెట్టుకోవాలని, మహిళలు కుంకుమ పెట్టుకోవాలని సూచించారు. జనవరి ఫస్టు కాకుండా గుడి పడ్వాను నూతన సంవత్సరంగా జరుపుకోవాలన్నారు. పిల్లలను కాన్వెంట్ స్కూల్స్ కు పంపించొద్దని, ఫోన్ లో 'హలో' కు బదులుగా నమస్కారం అనాలని లత సలహాయిచ్చారు. మన సంస్కృతిని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

>
మరిన్ని వార్తలు