87 బంగారు కడ్డీలు స్వాధీనం

2 Jan, 2017 08:53 IST|Sakshi
87 బంగారు కడ్డీలు స్వాధీనం

చెన్నై: తమిళనాడులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది.  రామనాథపురం జిల్లా ఉచ్చిపుళ్లి రైల్వే గేట్‌ సమీపంలో రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీలంక నుంచి తరలిస్తున్న 8.7 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ కారులో అధికారులు తనిఖీలు జరపగా డ్రైవర్‌ సీటు కింద ఉన్న బ్యాగులో 87 బంగారు బిస్కెట్లు కనిపించాయి. ఇవన్నీ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా ఉంది. ఒక్కొక్కటీ 100 గ్రాముల బరువుంది. దీంతో 8.7 కిలో బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2.44 కోట్లని తెలిపారు. కారు డ్రైవర్ ముజిబుర్‌ రెహమాన్‌ను అరెస్టు చేసి మధురై జైలుకు తరలించారు. ఇవన్నీ శ్రీలంక నుంచి పడవలో తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 




 

మరిన్ని వార్తలు