1381 కేజీల బంగారం పట్టివేత

17 Apr, 2019 19:56 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఎన్నికల వేళ భారీగా బంగారం పట్టుబడుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎన్నికల సమయంలో బంగారంతో పాటు భారీగా అక్రమ నగదు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో 1381 కేజీల బంగారం పట్టుబడింది. చెన్నై సమీపంలోని తిరువల్తూరు జిల్లా వేపంబట్టు టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఫ్తెయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వ్యాన్లలో బంగారం, కొంతమేర నగదును తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారానికి సంబంధించి సరైన సమాధానం రాకపోవడంతో వాహనాలతో సహా సీజ్‌ చేశారు.

కాగా రేపు దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ జరుగునున్న నేపథ్యంలో భారీగా బంగారం పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్లకు పంచేందుకే తరలిస్తున్నారా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. తెలి విడుత పోలింగ్‌ ముందు కూడా తమిళనాడు సరిహద్దుల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా అధికారులకు పట్టుబడిన బంగారాన్ని టీటీడీకి చెందినదిగా గుర్తించారు. తనిఖీల్లో పట్టుకున్న బంగారాన్ని విడిపించేందుకు టీటీడీ ఇచ్చిన లేఖతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మేనేజర్‌ తమిళనాడుకు బయలుదేరారు.

మరిన్ని వార్తలు