పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించండి

18 Jun, 2019 18:27 IST|Sakshi

న్యూ ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ ఎంపీ జీ వీ ఎల్ నరసింహారావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిశారు. పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగా తక్కువ నాణ్యత కలిగిన పొగాకు కిలో రూ.20 చొప్పున ధరను అమలు చేయాలని కోరారు. అదే విధంగా పంట మార్పిడికి నష్ట పరిహారంగా ఒక బారన్ పొగాకుకు సుమారు రూ. 5 నుంచి 10 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు