'హిందీని దేశ బాషగా తీర్చిదిద్దాలి'

11 Sep, 2015 20:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో హిందీని అధికారభాష చేయాలన్నా, విశ్వభాషగా మార్చాలన్నా దేశభాషగా తీర్చిదిద్దాల్సిన అసవరం ఎంతైనా ఉందని కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అభిప్రాయపడ్డారు. హిందీయేతర రాష్ట్రాలను అలక్ష్యం చేస్తే, హిందీ ఎప్పటికీ విశ్వభాష కాలేదని ఆయన అన్నారు. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో భోపాల్‌లో నిర్వహిస్తున్న 10వ ప్రపంచ హిందీ మహాసభల్లో శుక్రవారం 'హిందీయేతర భాషా ప్రాంతాల్లో హిందీ' అంశంపై గోష్టిని ఆయన ప్రారంభించారు.

హిందీయేతర రాష్ట్రాల్లోని హిందీ సంస్థల్లోని ఉద్యోగాలను స్థానిక పండితులకే ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రాల స్థానిక భాషల్లోని సాహిత్యాన్ని హిందీలోకి అనువదించి ఉత్తరాది రాష్ట్రాల పాఠ్యపుస్తకాల్లో చేరిస్తే జాతీయ సమైక్యత వెల్లివిరుస్తుందని యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ సూచించారు.

>
మరిన్ని వార్తలు